గోల్నాక, అక్టోబర్ 25 : మద్యం మత్తులో ఓ వ్యకి వీరంగం సృష్టించాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వాహనం ఆపినందుకు నన్నే ఆపుతావా అంటూ మందుబాబు ట్రాఫిక్ ఎస్సై కాలర్ పట్టుకొని దాడికి యత్నించాడు. ఈ ఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్ వివరాల ప్రకారం…శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో అంబర్‌పేట -రామంతాపూర్ ప్రధాన రహదారిలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద కాచిగూడ ట్రాఫిక్ ఎస్సై రాకేశ్ విధి నిర్వహణలో భాగంగా తన సిబ్బందితో కలసి డ్రంక్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అదే సమయంలో భువనగిరికి చెందిన మీసాల శ్రీనివాస్.. తన స్నేహితుడు కోటేశ్వర రావుతో కలసి బైక్(టీఎస్08జేజడ్4287)పై వచ్చారు. కానిస్టేబుల్ పాండు వారి వాహనాన్ని ఆపి టెస్ట్ చేయగా 118 ఆల్కాహాల్ శాతం నమోదు అయింది. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించిన ఎస్సై రాకేశ్‌పై మద్యం మత్తులో ఉన్న మీసాల శ్రీనివాస్..మమ్మల్నే ఆపి చెక్ చేస్తావా అంటూ అతని కాలర్ పట్టుకొని దాడికి యత్నించాడు. మీ అంతు చూస్తామంటూ ఎస్సై రాకేశ్‌తో పాటు కానిస్టేబుల్ పాండును బెదిరించి అక్కడి నుంచి పారిపోయారు. ట్రాఫిక్ ఎస్సై రాకేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.