మలక్‌పేట, నవంబర్ 28: గుర్తు తెలియని పదార్థం తిని ఇద్దరు మృతి చెందిన సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని సలీంనగర్ పార్కు వద్ద జరిగింది. ఎస్ఐ సురేశ్ కథనం ప్రకారం.. బుధవారం సాయంత్రం సలీంనగర్ పార్కు వద్ద ఇద్దరు వ్యక్తులు చనిపోయి ఉండటాన్ని గమనించిన స్థానికులు డయల్ 100కు సమాచారం అందించారు.
వారు మలక్‌పేట పోలీసులను అప్రమత్తం చేయగా.. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సురేశ్ మృతదేహాలను పరిశీలించగా.. జీహెచ్ఎంసీ చెత్తవాహనంపై పనిచేసే లేబర్ అంబర్‌పేటకు చెందిన వెంకటేశ్(35)గుర్తించారు. అదేవిధంగా మరో వ్యక్తి మూసారాంబాగ్ సంజీవయ్యనగర్‌కు నరేందర్(45) లేబర్‌గా గుర్తించారు. ఇద్దరు కలిసి బుధవారం సాయంత్రం సలీంనగర్ పార్కు వద్ద ఏదో గుర్తు తెలియని పదార్థాన్ని తిని చనిపోయారని స్థానికులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ ఏం తిని చనిపోయారనేది తెలుస్తుందని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు.