Hyderabad | మియాపూర్, ఫిబ్రవరి 21: హైదరాబాద్లోని మియాపూర్లో దారుణం జరిగింది. బొల్లారం క్రాస్ రోడ్డులోని బస్టాప్ దగ్గర నిలబడి ఉన్న మతిస్థిమితం లేని మహిళ(38)ను ఇద్దరు వ్యక్తులు బైక్పై తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
బైక్పై మహిళను తీసుకెళ్లడం గమనించిన ఆటో డ్రైవర్ చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన మియాపూర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు స్కూటీపై మహిళను బలవంతంగా తీసుకెళ్తున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. మహిళ ఆచూకీ కోసం వెతికారు. ఈ క్రమంలో బొల్లారం రోడ్డులో తిరుగుతున్న మహిళను పోలీసులు గుర్తించారు.
బాధితురాలిని పోలీసు స్టేషన్కు తీసుకొచ్చి విచారించడగా.. ఆ మహిళకు మతిస్థిమితం లేదని తెలిసింది. దీంతో ఇద్దరు దుండగులు మహిళను ఎక్కడికి తీసుకెళ్లారు? ఆమెపై అత్యాచారం చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను మియాపూర్ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నట్లు సమాచారం.