శేరిలింగంపల్లి: అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన కన్నయ్యలాల్ (25), దేరామ్ (24) నగరానికి వలసవచ్చి కొల్లూరులోని ఇంద్రారెడ్డి నగర్లో నివాసం ఉంటూ.. స్థానికంగా టైల్స్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 12:25 గంటల సమయంలో ఇద్దరూ ఇంద్రారెడ్డి నగర్ నుంచి నానక్‌రాంగూడలోని సత్వాకు కారులో అతివేగంగా వెళ్తూ.. ఔటర్ రింగు రోడ్డు వద్ద ఉన్న నియో పోలిస్ బ్రిడ్జ్ వద్ద పిల్లర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కన్నయ్యలాల్, దేరామ్ అక్కడికక్కడే మృతి చెందారు.