శేరిలింగంపల్లి, జూన్ 27: రాయదుర్గం పరిధిలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల నరేశ్ తన భార్య, ఐటీ ఉద్యోగిని కల్యాణి (30)తో కలిసి శనివారం ద్విచక్రవాహనంపై వెళ్తూ..గచ్చిబౌలి బయో డైవర్సిటీ జంక్షన్ వద్ద యూ టర్న్ తీసుకుంటుండగా, వెనుక నుంచి వచ్చిన కారు అదుపు తప్పి వీరి వాహనాన్ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన కల్యాణి చనిపోయింది. మరో ఘటనలో గచ్చిబౌలి జేవీ కాలనీలో నివసిస్తున్న అబ్బీ ఆనంద్ సింగ్ (27) శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తూ..ఖాజాగూడ లేక్ రోడ్డు వద్ద యూ టర్న్ తీసుకుంటుండగా, మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఆనంద్ సింగ్ తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.