హైదరాబాద్: హైదరాబాద్ ఎల్బీనగర్ సమీపంలోని చింతలకుంటలో విషాదం చోటుచేసుకున్నది. హైటెన్షన్ విద్యుత్ తీగలు (High Tension Wires) తెగిపడి ఇద్దరు సజీవదహనం అయ్యారు. చింతలకుంటలో రోడ్డుపక్కన ఫుట్‌పాత్‌పై ఇద్దరు వ్యక్తులు నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో హైటెన్షన్ విద్యుత్ తీగలు వారిపై పడిపోయాయి. దీంతో మంటలు అంటుకుని అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. అక్కడే ఉన్న ఓ శునకం కూడా విద్యుదాఘాతంతో కాలిబూడిదయింది. సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను యాచకులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.