హైదరాబాద్: హైదరాబాద్ మీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున నందనవనం వద్ద మోటార్ బైక్‌ను లారీ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరి మీద నుంచి లారీ వెళ్లడంతో వారి మృతదేహాలు నుజ్జునుజ్జు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మసాజ్ సెంటర్‌పై పోలీసుల దాడి..
నగరంలోని ఎస్సార్ నగరల్లో ఉన్న ఓ మసాజ్ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేశారు. నిర్వాహకుడితోపాటు యువతులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.