మేడ్చల్ జిల్లా: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట (Shamirpet) మండలం తుర్కపల్లి వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అప్పటికీ ఆగని కారు.. డివైడర్ అవతలివైపు నుంచి వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా మరో ఏడుగురు తీవ్రంగా గాపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను దవాఖానకు తరలించారు.
మృతులను సిద్దిపేట జిల్లా వర్గల్‌కు చెందిన రాజు, మురారి పల్లికి చెందిన శ్రవణ్‌గా గుర్తించారు. కారు సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగు ప్రయాణిస్తుండగా, డీసీఎంలో ముగ్గురు ఉన్నారని వెల్లడించారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.