మైలార్‌దేవ్‌పల్లి, ఆగస్టు 26: ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్‌పై(Same registration) రెండు ఆటోలు నడిపిస్తున్న (Autos seized) వాటిని సోమవారం రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ దుర్గానగర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్ స్వామి సిబ్బందితో కలిసి విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సమయంలో ఒకే రిజిస్ట్రేషన్‌తో (టిఎస్15యూఎఫ్1543) నెంబర్ ఉన్న రెండు ఆటోలు ట్రాఫిక్ పోలీసులకు కనిపించాయి. వెంటనే అలర్ట్ అయి రెండు ఆటోలను ఆపి వివరాలను సేకరించారు.
అందులో ఒకటి ఒరిజినల్ రిజిస్ట్రేషన్ ఆటో కాగా మరొకటి డమ్మీ నెంబర్ ప్లేట్‌గా గుర్తించారు. అక్రమంగా ఒకే రిజిస్ట్రేషన్‌పై రెండు ఆటోలను నడిపిస్తున్నట్లు గుర్తించారు. రెండు ఆటోలను స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు.
ఇవి కూడా చదవండి..
Yadadri | రేపు యాదాద్రికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు
MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ..!