సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర నుంచి వచ్చి హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయించే ప్రయత్నం చేస్తున్న ఇద్దరితోపాటు మరొకరు కూడా తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో(టీనాబ్) అరెస్టు చేసింది. టీనాబ్ ఎస్పీ గుమ్మి చక్రవర్తి కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన హైదర్ ఇక్బాల్ సిద్దీఖి మక్వా, ముస్తాక్ షా అలియాస్ ముస్తాక్ చరాస్ అక్కడి నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు.
స్థానికంగా డ్రగ్స్ విక్రయించే పహాడీషరీఫ్‌కు చెందిన సయ్యద్ జావేద్‌తో పరిచయం ఏర్పడింది. మంగళవారం అతడికి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు టీనాబ్ ఇన్స్పెక్టర్ రమేశ్‌రెడ్డి బృందం ఈ నిందితులను అరెస్టు చేసింది. నిందితుల వద్ద నుంచి రెండు కిలోల గంజాయి, 1030 గ్రాముల చరస్‌ను స్వాధీనం చేసుకున్నారు.