హైదరాబాద్ : అక్రమంగా గోధుమ పిండి( Flour illegally) తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్(Arrested) చేశారు. అక్రమ్, తనీష్ అనే ఇద్దరు వ్యక్తులు పీడీఎస్ గోధుమలతో(PDS wheat) అక్రమంగా గోధుమ పిండి చేసి విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.2.30 లక్షల విలువైన పీడీఎస్ గోధుమలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.