విశ్రాంత ఐపీఎస్ సతీమణి హత్య కేసులో ట్విస్ట్
జూబ్లీహిల్స్‌లో విశ్రాంత ఐపీఎస్ సతీమణి భార్య తనూజ రంజన్ హత్య కేసులో నింది తుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. పనిమనిషి కల్పనతో పాటు మరో ముగ్గురు మాత్రమే పాల్గొన్నారని ముందుగా భావించారు. తాజా గా పోలీసుల విచారణలో భాగంగా మొత్తం ఏడుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించారు.
- చోరీ సొత్తు పంచుకుని సరిహద్దు దాటిన ముగ్గురు
- నేపాలీ గ్యాంగ్ సభ్యుడి అరెస్ట్
బంజారాహిల్స్,మే 21: జూబ్లీహిల్స్‌లో విశ్రాంత ఐపీఎస్ సతీమణి భార్య తనూజ రంజన్ హత్య కేసులో నింది తుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. పనిమనిషి కల్పనతో పాటు మరో ముగ్గురు మాత్రమే పాల్గొన్నారని ముందుగా భావించారు. తాజా గా పోలీసుల విచారణలో భాగంగా మొత్తం ఏడుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించారు. చోరీ గ్యాంగ్‌లో సభ్యుడైన సునీల్ పర్యార్‌ను గురువారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సునీల్ పర్యార్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
మే 8న తనూజ రంజన్ ఇంట్లో చోరీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్‌లో కల్పనతో పాటు సురేష్ షాహీ అలియాస్ సృజన్ షాహీ, గణేష్ బికా, కందాలామా, నేత్ర షాహీ, సునీల్ పర్యార్, గణేష్ షాషీ అనే వ్యక్తులున్నారని తేలింది. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం నేరుగా రైల్లో కాజీపేట వెళ్లి అక్కడనుంచి ముంబయికి చేరుకున్న నేపాలీ గ్యాంగ్ సభ్యులు అక్కడే చోరీ సొత్తును పంచుకున్నట్లు తేలింది. అక్కడినుంచి ఎవరికి వారు వేర్వేరు మార్గాల్లో పారిపోయినట్లు తేలింది. కాగా ముంబయికి చేరుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేయగా సునీల్ పర్యార్ మాత్రమే చిక్కాడు. అతడు దిలీప్ బహుదూర్ అనే వ్యక్తికి బంగారం విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సునీ ల్ పర్యార్‌ను రిమాండ్‌కు తరలించారు.
నేపాల్ సరిహద్దులు దాటిన నిందితులు..
ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్‌లో తనూ జ రంజన్‌ను హత్య చేసిన అనంతరం వారిని పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులతో పాటు ప్రత్యేక బృందాలు అదే రోజున రంగంలోకి దిగాయి. నాలు గు బృందాలు ఉత్తర్‌ప్రదేశ్‌లోని నేపాల్ సరిహద్దులో మొహరించాయి. అయితే నేపాల్‌కు, భారత్‌కు మద్యన సుమారు 1700 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉండడంతో పాటు దాదాపు 400దాకా చెక్‌పోస్ట్‌లు ఉండడంతో నేపాలీ గ్యాంగ్‌లోని ముగ్గురు నిందితులు సరిహద్దులు దాటినట్లు పోలీసులు గుర్తించారు. దౌత్యమార్గంలో నేరస్థులను పట్టుకోవడం ఒక్కటే ప్రస్తుతం పోలీసుల ముందున్న మార్గం గా కనిపిస్తోంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
West Bengal | కోల్‌కతా నవరాత్రుల్లో విషాదం.. 17 మంది దుర్మరణం
India vs West Indies | వరుణుడే విజేత.. ఐదో టీ20 వాన ఖాతాలోకి.. 2-2తో సిరీస్ పంచుకున్న భారత్, విండీస్
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
KCR | కేసీఆర్ సార్ క్షమించండి!.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినం.. న్యూస్ చానల్ డిబేట్ లైవ్‌లో ఓ రైతు ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

