TSRTC | హైదరాబాద్ : ఈ నెల 16న (ఆదివారం) యూపీఎస్సీ నిర్వహించే ఎన్డీఏ, నేషనల్ అకాడమి, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ వంటి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు ప్రకటించారు.
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు.. ఈ పరీక్షల సమయాలకు అనుగుణంగా పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకుని, తిరిగి ఇంటికి చేరుకునే విధంగా సిటీ బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. బస్సుల రాకపోకలు, సమయాల గురించి కోఠిలో 9959226160, రేతిఫైల్ నుంచి 995226154 నంబర్లను సంప్రదించాలని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.