
లాక్డౌన్లో అత్యవసర సేవలకు ఆర్టీసీ బస్సులు సేవలందిస్తున్నాయి. కుషాయిగూడ ఆర్టీసీ డిపో నుంచి అత్యవసర సేవలకు బస్సులను ఉదయం 6 నుంచి రాత్రి 7.30గంటల వరకు నడుపుతున్నారు. ఈసీఐఎల్ నుంచి అఫ్జల్‌గంజ్ ఉస్మానియా దవాఖానకు రెండు బస్సులు, గచ్చిబౌలిలోని టీమ్స్‌కు 2, సనత్‌నగర్‌లోని ఈఎస్ఐకి 2, పంజాగుట్టలోని నిమ్స్‌కు 2, ట్యాంక్ బండ్ వద్ద ఉన్న జీహెచ్ఎంసీ కార్యాలయానికి 2 బస్సులను నడుపుతున్నారు. ఆయా దవాఖానల్లో సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులతో పాటు సిబ్బందిని కూడా అనుమతిస్తున్నారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. ఈసీఐల్ నుంచి సికింద్రాబాద్, ఉప్పల్, ఘట్కేసర్ ప్రాంతాలకు ఉదయం 6 నుంచి 10గంటల వరకు బస్‌లను నడుపుతున్నారు.