e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home హైదరాబాద్‌ గాలిలో కార్బన్‌ మోనాక్సైడ్‌ తగ్గు ముఖం

గాలిలో కార్బన్‌ మోనాక్సైడ్‌ తగ్గు ముఖం

గాలిలో కార్బన్‌ మోనాక్సైడ్‌ తగ్గు ముఖం

సిటీబ్యూరో, జూన్‌ 5(నమస్తే తెలంగాణ): కరోన వ్యాప్తి కట్టడిలో భాగంగా అమలు జరుగుతున్న లాక్‌డౌన్‌తో వాతావరణంలో మంచి మార్పు సంభవిస్తుం ది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే వాతావరణంలో వాయు కాలుష్యం తో పాటు కార్బన్‌ మోనాక్సైడ్‌ శాతం గణనీయంగా తగ్గినట్లు పీసీబీ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా పెట్రోలియం ఉత్పత్తులతో నడిచే వాహనాల నుంచి కార్బన్‌ మోనాక్సైడ్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనికి తోడు గతంలో నగర వ్యాప్తంగా 24 గంటల పాటు వాహన ర ద్దీ ఉంటుండగా, ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా నగరంలో వాహనాల రద్దీ ఒంటి గంట వరకు మాత్రమే ఉంటుంది. వా రం రోజుల కిందట 10 గంటల వరకు మాత్రమే వాహనాల రాకపొకలు జరిగా యి.

ఈ క్రమంలోనే నగరంలోని కాలు ష్య నమోదు కేంద్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా సాధారణ స్థాయి కంటే త క్కువగా కార్బన్‌ మోనాక్సైడ్‌ శాతం నమో దు జరిగింది. వాస్తవానికి సీపీసీబీ నిర్ధారించిన హద్దుల ప్రకారం, పారిశ్రామిక వాడలలో 1ఎంజీ/ఎం3, కాలనీలలో 5 ఎంజీ/ఎం3, స్కూల్స్‌, పాఠశాలల వద్ద సుమారు 2ఎంజీ/ఎం3 కార్బన్‌ మోనాక్సైడ్‌ ఉన్నా, పెద్దగా నష్టం ఉండదు. కాని, ఈ మే 23వ తేదీ నుంచి 31వ తేదీ వర కు నగరంలోని కాలుష్య నమోదు కేంద్రా ల్లో సాధారణ స్థాయి కంటే తక్కువగా కార్బన్‌ మోనాక్సైడ్‌ మిల్లీగ్రామ్‌/ఎం3 నమోదు జరిగింది.

హెచ్‌సీయూ ప్రాం తంలో 0.3ఎంజీ/ఎం3, సనత్‌నగర్‌ ప్రాంతంలో 0.4ఎంజీ/ఎం3, జూపార్కు ప్రాంతంలో 0.5 ఎంజీ/ఎం3, పాశ మై లారం 0.5 ఎంజీ/ఎం3, బొల్లారంలో 0.3 ఎంజీ/ఎం3, ఇక్రిశాట్‌ ప్రాంతంలో 0.3 ఎంజీ/ఎం3 నమోదైనట్లు పీసీబీ ప్ర కటించిన ఏఏక్యూ (ఆంబియంట్‌ ఎయి ర్‌ క్వాలిటీ) నివేదికలో పేర్కొన్నారు. వా తావరణంలో కార్బన్‌ మోనాక్సైడ్‌ ఎక్కువైతే శరీర జీవ కణాలకు ఆక్సిజన్‌ లేకుం డా చేస్తుందని, అలాగే, అపస్మారకం ఏ ర్పడుతుందని, దీని పరిధి 100 పీపీఎం దాటితే మనిషికి మరణం కూడా సంభవిస్తుందని పీసీబీ సైంటిస్టులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో కార్బన్‌ మోనాక్సైడ్‌ తగ్గడం మంచి పరిణామమ ని పీసీబీ అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గాలిలో కార్బన్‌ మోనాక్సైడ్‌ తగ్గు ముఖం

ట్రెండింగ్‌

Advertisement