PBKS vs GT | ఈజీ టార్గెట్‌ను చేధించడంలో గుజరాత్ ప్రయాస పడుతోంది. వరుసగా వికెట్లను కోల్పోవడంతో కష్టాల్లో కూరుకుపోయింది. 15వ ఓవర్లో సాయి సుదర్శన్ (31) ఔటవ్వగా.. 16వ ఓవర్లో రెండో బంతికే ఒమర్జాయ్ (13) పెవిలియన్ చేరాడు. అంతకుముందు 11వ ఓవర్లో ఐదో బంతికి మిల్లర్ (4) బౌల్డ్ అయ్యాడు. 10వ ఓవర్లో మూడో బంతికి శుభ్‌మన్ గిల్ (35) ఔటయ్యాడు. రబాడా బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టేందుకు యత్నించి లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చాడు. అంతకుముందు నాలుగో ఓవర్లో నాలుగో బంతికి వృద్ధిమాన్ సాహా (13) ఔటయ్యాడు.