TSARDU JAC : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉపాధి కోల్పోయిన ఆటోవాలాలు భారీ ధర్నాకు సిద్ధమవుతున్నారు. రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీల అమలు చేయాలనే డిమాండ్లతో డిసెంబర్ 9 మంగళవారం ధర్నా చేయాలని సంకల్పించారు. న్యాయమైన తమ డిమాండ్ల సాధన కోసం ఖైరతాబాద్‌లోని రాష్ట్ర రవాణా కార్యాలయం ముందు ఉదయం 11 గంటలకు ధర్నా నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ఆటోరిక్షా డ్రైవర్స్ యూనియన్ జేఏసీ(TSARDU JAC) తెలిపింది.
ఈ నిరసన కార్యక్రమంలో ఆటో అన్నలు భారీ సంఖ్యలో పాల్గొనాలని టీఎస్ఏఆర్డీయూ కన్వీనర్ బి.వెంకటేశం కోరారు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆటోవాలాల పాలిట శాంపంగా మారిందని, ప్రభుత్వం తమకిచ్చిన హామీలపై ఒత్తిడి పెంచేందుకు ధర్నాకు సిద్ధమవుతున్నామని వెంకటేశం వెల్లడించారు. టీఎస్ఏఆర్డీయూ తలపెట్టిన ఈ ధర్నాకు ఏఐటీయూసీ, బీఆర్టీయూ, టీయూసీఐ, ఐఎఫ్టీయూ, టీఎన్టీయూసీ, టీయాడ్స్, తెలంగాణ జాగృతి గట్స్ సంస్థలు మద్దతిచ్చాయి.

ఆటో మోటార్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో మెయింటెనన్స్ క్సోం సంవత్సరానికి రూ.12వేలు ఇవ్వాలి. ఆటో మీటర్ ఛార్జీలు పెంచాలలి. ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి అక్రమంగా నడుస్తున్న టూవీలర్, బైక్‌లను నిషేధించాలి. రాష్ట్ర ప్రభుత్వమే ఒక యాప్ తయారు చేసి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి.