పంజాబ్‌కో న్యాయం.. తెలంగాణకో న్యాయమా..?
వడ్లు కొనేదాకా.. ఉద్యమం ఆగదు
కేంద్రం దిగొచ్చే వరకు.. ఢిల్లీలో ధర్నా చేస్తాం
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఆగ్రహం
శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 6 : తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యంను కేంద్ర ప్రభుత్వమే కోనుగోలు చేయాలని రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం శంషాబాద్ పట్టణంలోని ఎయిర్‌పోర్టు బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిపై మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు సాగుచేసిన వరి ధాన్యం కొంటామని అనేక హామీలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొనకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేసేవరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. త్వరలోనే మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరం కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. పంజాబ్ రాష్ట్రంలో రైతులు సాగు చేసిన పంటలు ఏ విధంగా కోనుగోలు చేస్తున్నారో.. ఆదే విధంగా తెలంగాణ రైతుల పంటలను కోనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే ఢిల్లీ వెళ్లి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు నిత్యవసర ధరలతో పాటు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదలను కొట్టి పెద్దలకు దారపోస్తున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మున్సిపల్ చైర్పర్సన్లు సుష్మ, రేఖ, శంషాబాద్ ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ తన్వి, గణేశ్‌గుప్తా, వైస్ చైర్మన్ గోపాల్‌యాదవ్, వైస్ ఎంపీపీ నీలంనాయక్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దండుఇస్తారి, సతీశ్‌యాదవ్, రాంగోపాల్, రాజ్‌కుమార్, కౌన్సిలర్లు అజయ్, అనిల్‌కుమార్, నాయకులు మోహన్‌రావు, పారేపల్లి శ్రీనివాస్‌గౌడ్, రవీందర్‌నాయక్, శ్రావణ్‌గౌడ్, మైలారంభిక్షపతి, శ్రీకాంత్గౌడ్లతో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.