LB Nagar | వనస్థలిపురం, మే 14 : సాహెబ్‌నగర్‌లోని ప్రఖ్యాత త్రినేత్రాంజనేయ స్వామి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో, భక్తుల కోలాహాలం మధ్య ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. సాహెబ్‌నగర్, వనస్థలిపురం పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగిఉండాలని సూచించారు. దేవస్థానం అభివృద్ధికి ఇప్పటికే ఎంతో చేశామని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
పూజలు చేసిన కార్పొరేటర్ లచ్చిరెడ్డి..
బీఎన్‌రెడ్డినగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి జాతర ఉత్సవాలకు హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 400ల ఏళ్ల చరిత్ర కలిగిన గొప్ప ఆలయం సాహెబ్‌నగర్‌లో ఉందన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దేవున్ని ప్రార్థించామన్నారు. జాతర కార్యక్రమంలో సాహెబ్‌నగర్ గ్రామ పెద్దలు, దేవస్థానం కమిటీ సభ్యులు, పలు పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.