వైభవంగా పరమేష్టి యాగం

త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో
దివ్యసాకేత నగరంలో నిర్వహణ
శంషాబాద్, మే 1: కరోనా మహమ్మారి నుంచి దేశం, రాష్ర్టాన్ని కాపాడాలని కోరుతూ పరమేష్టి యాగం నిర్వహించినట్లు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి శ్రీ మన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి తెలిపారు. శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధి ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామనగరంలోని దివ్యసాకేత క్షేత్రంలో సర్వరోగ నివారణ పరమేష్టి ఆగమ ప్రక్రియ యాగాన్ని వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆశ్రమ వేదపండితులు, వేద విద్యార్థులు విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, హోమం, జువ్వి సమిధలు, తామర పూలతో హోమం, ఆశీర్వచనాన్ని శాస్ర్తోక్తంగా జరిపారు.
ఈ సందర్భంగా చినజీయర్ స్వామిజీ మాట్లాడుతూ కరోనా విజృంభిస్తూ చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ పొట్టన పెట్టుకుంటుందన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలు, వైద్యులు అవిశ్రాంతంగా పోరాడుతున్నారన్నారు. భక్త జనులకు ఆరోగ్యం, మనో బలాన్ని అనుగ్రహించాలని దైవాన్ని ప్రార్థించామన్నారు. కార్యక్రమంలో అహోబిల జీయర్ స్వామి, శ్రీ దేవనాగరజీయర్ స్వామితో పాటు పలువురు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

