Saidabad SI | సైదాబాద్, జూలై 4 : గిరిజన సంఘం మహిళా నాయకురాలి పట్ల అనుచితంగా వ్యవహరించిన సైదాబాద్ ఎస్ఐ సాయిక్రిష్ణపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ గిరిజన సంఘాల నాయకులు శుక్రవారం సౌత్ ఈస్ట్ జోన్ డిసిపి చైతన్యకుమార్ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గిరిజన మహిళా నాయకురాలు పట్ల ఎస్ఐ సాయి కృష్ణ వ్యవహరించిన తీరుపై సమగ్రంగా విచారణ జరిపించి అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సేవాలాల్ బంజార సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కోర్ర మెతిలాల్ నాయక్, సిపిఐ పార్టీ నగర కౌన్సిల్ మెంబర్, సేవాలాల్ బంజారా సంఘం మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సక్రి బాయి, సిపిఐ పార్టీ నాయకులు హరి నాయక్, షేక్ మహబూబ్, మోహన్ నాయక్, వస్రం నాయక్, తదితరులు పాల్గొన్నారు.