హైదరాబాద్: నగరంలోని నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటినతర్వాత నాంపల్లిలోని ఫ్యాబ్సి వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో పక్కనే ఉన్న అపార్టుమెంటులో మంటలు చెలరేగాయియి. భయాందోళనకు గురైన అపార్ట్‌మెంట్‌వాసులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.