అవినీతి అధికారులకు బదిలీ బహుమతి
స్టేషన్‌కు వచ్చిన వారి ఫిర్యాదు తీసుకోకుండా డబ్బు కోసం ఇబ్బందులకు గురిచేయడం, నిందితులతో దోస్తీ చేస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే ముఠాలకు సహకరించే పోలీసులపై రాచకొండ సీపీ తరుణ్‌జోషి చర్యలు చేపట్టారు.
- ఉత్తర్వులు జారీ చేసిన రాచకొండ సీపీ
సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): స్టేషన్‌కు వచ్చిన వారి ఫిర్యాదు తీసుకోకుండా డబ్బు కోసం ఇబ్బందులకు గురిచేయడం, నిందితులతో దోస్తీ చేస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే ముఠాలకు సహకరించే పోలీసులపై రాచకొండ సీపీ తరుణ్‌జోషి చర్యలు చేపట్టారు. ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భగాయత్ ప్రాంతంలోకి వచ్చే జంటలను బ్లాక్మెయిల్ చేసి డబ్బు లాగుతున్న ముఠాలతో సంబంధాలు పెట్టుకున్న ఎస్సై శంకర్‌ను శనివారం సీపీ కార్యాలయానికి అటాచ్ చేయగా, తాజాగా ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్‌రెడ్డిని కూడా అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే నాగోల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన బాధితులతో సరిగా వ్యవహరించకపోవడంతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదులో నిర్లక్ష్యం వహించడంతో సీపీకి ఫిర్యాదు వెళ్లింది. ఈ విషయంలో నాగోల్ ఇన్స్పెక్టర్ పరశురామ్, ఎస్సై, ఏఎస్సైలను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉప్పల్ ఠాణాకు డీసీ మన్మధకుమార్, నాగోల్ ఠాణాకు ఎల్బీనగర్ డీఐ ఎ.సుధాకర్లకు అదనంగా ఎస్హెచ్ఓ బాధ్యతలు అప్పగించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

