Hyderabad | రంజాన్ నేపథ్యంలో రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
Hyderabad | హైదరాబాద్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మీరాలం ఈద్గా, మాసాబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్స్ పరిసరాల్లో ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు(మూడున్నర గంటలు) ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు.
Hyderabad | హైదరాబాద్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మీరాలం ఈద్గా, మాసాబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్స్ పరిసరాల్లో ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు(మూడున్నర గంటలు) ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ మార్గాల్లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
-పురానాపూల్, కామటిపురా, కిషన్ బాగ్ నుంచి మీరాలం ఈద్గాకు ప్రార్థనల కోసం వచ్చే వారి వాహనాలను బహదూర్‌పురా క్రాస్ రోడ్స్ వరకే అనుమతిస్తారు. సాధారణ ట్రాఫిక్‌ను తాడ్బన్, ఈద్గా వైపు అనుమతించరు. సాధారణ ట్రాఫిక్‌ను దానమ్మ హాట్స్ క్రాస్ రోడ్డు వద్ద శాస్త్రిపురం వైపు అనుమతిస్తారు. మోచి కాలనీ, బహదూర్‌పురా, షంషీర్గంజ్, నవాబ్ షాహెబ్ కుంట వైపు వాహనాలను మళ్లించనున్నారు.
-పురానాపూల్ నుంచి బహదూర్‌పురా వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను పురానాపూల్ దర్వాజా వద్దనే మళ్లించనున్నారు. శంషాబాద్, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి నుంచి బహదూర్‌పురా వైపు వచ్చే వాహనాలను ఆరాంఘర్ జంక్షన్ వద్ద పలు మార్గాల్లో మళ్లించనున్నారు.
-మాసబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్ కింద వాహనాలను అనుమతించరు. లక్డీకాపూల్, మోహదీపట్నం నుంచి వచ్చే వాహనాలను ఫ్లై ఓవర్ మీదుగానే అనుమతిస్తారు.
-మెహిదీపట్నం నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 వైపు వచ్చే వాహనాలను మాసబ్ ట్యాంక్ మీదుగా అయోధ్య జంక్షన్, ఖైరతాబాద్, ఆర్టీఏ కార్యాలయం, ఖైరతాబాద్, తాజ్ కృష్ణా హాటల్ మీదుగా వాహనాలకు అనుమతి ఇవ్వనున్నారు. లక్డీకాపూల్ నుంచి మాసబ్ ట్యాంక్ మీదుగా రోడ్ నంబర్ 1, 12 వైపు వచ్చే వాహనాలను అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, ఖైరతాబాద్, వీవీ విగ్రహం, ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు, తాజ్ కృష్ణా హోటల్ మీదుగా అనుమతించనున్నారు. ప్రార్థనలు ముగిసే వరకు మాసబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్ కిందకు వాహనాలను అనుమతించరు.
-బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి మాసబ్ ట్యాంక్ వైపు వచ్చే వాహనాలను తాజ్ కృష్ణా హోటల్, ఆర్టీఏ కార్యాలయం మీదుగా అనుమతించనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
KTR | మూడు నెలల్లో పిల్లలు పుడతారా అన్న రేవంత్.. మరి మూడేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదు.. రైతు గర్జనలో నిలదీసిన కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

