KTR | మూడు నెలల్లో పిల్లలు పుడతారా అన్న రేవంత్.. మరి మూడేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదు.. రైతు గర్జనలో నిలదీసిన కేటీఆర్
KTR | ‘మూడు నెలల్లో పిల్లలు పుట్టరన్న విషయం మాకు కూడా తెలుసు. మాకు కూడా పెళ్లిళ్లు అయ్యాయి.. పిల్లలు ఉన్నారు. కానీ మూడు నెలల్లో పిల్లలు పుట్టకపోతే సరే.. మరి మూడేళ్లకు కూడా పుట్టకపోతే నిన్ను ఏమనాలి? మూడేళ్లయినా హామీలు నెరవేరకపోతే నిన్ను ఏమనాలి?’ అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.
KTR | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మూడేళ్లు గడిచినా నెరవేర్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మూడు నెలల్లో హామీలన్నీ అమలు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు ప్రశ్నిస్తే ‘మూడు నెలల్లో పిల్లలు పుడతారా?’ అంటూ సమాధానం చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మూడు నెలల్లో పిల్లలు పుట్టరన్న విషయం మాకూ తెలుసు, మరి మూడేళ్లు గడిచినా హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన రైతు గర్జన సభలో కేటీఆర్ మాట్లాడారు.
ఇటీవల బోథ్ నియోజకవర్గానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఎన్నికల హామీలపై ప్రశ్నించారని కేటీఆర్ గుర్తుచేశారు. మూడు నెలల్లో వృద్ధుల పింఛన్ రూ.4 వేలకు పెంచుతామని, రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతుభరోసా ఇస్తామని, తులం బంగారం అందిస్తామని, ఆడపిల్లలకు నెలకు రూ.2,500 ఇస్తామని, మైనారిటీలకు రూ.4 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఇవన్నీ మూడు నెలల్లో అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులు గడిచినా ఏం చేశారని అనిల్ జాదవ్ ప్రశ్నించారని తెలిపారు.
దీనికి ముఖ్యమంత్రి ‘ఎంత కండలు తిరిగిన పహిల్వాన్ అయినా మూడు నెలల్లో పిల్లలను పుట్టిస్తాడా?’ అని సమాధానం చెప్పారని కేటీఆర్ విమర్శించారు. ‘మూడు నెలల్లో పిల్లలు పుట్టరన్న విషయం మాకు కూడా తెలుసు. మాకు కూడా పెళ్లిళ్లు అయ్యాయి.. పిల్లలు ఉన్నారు. కానీ మూడు నెలల్లో పిల్లలు పుట్టకపోతే సరే.. మరి మూడేళ్లకు కూడా పుట్టకపోతే నిన్ను ఏమనాలి? మూడేళ్లయినా హామీలు నెరవేరకపోతే నిన్ను ఏమనాలి?’ అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఇవేనా?
ఎన్నికల సమయంలో గ్యారంటీ కార్డు ఇచ్చి, అఫిడవిట్ ఇచ్చి మూడు నెలల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు వాటి గురించి నిలదీస్తే ఇలాంటి సమాధానాలు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి సమాధానం చెప్పకుండా తీవ్ర పదజాలంతో మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ‘లాగుల తొండలు ఇడుస్తా.. గుడ్లు వీకి గోడీలాడతా.. పేగులు మెడలు వేసుకుంటా’ అంటూ మాట్లాడుతున్నారని అన్నారు. ‘పేగులు మెడలు వేసుకోవడం ఏందిరా నాయనా? నువ్వు బోటీ కొట్టేటోడివా? ముఖ్యమంత్రివా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఇవేనా?’ అని ప్రశ్నించారు.
అని ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు హామీల అమలుపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు. ‘రైతుబంధు కింద కేసీఆర్ రూ.10 వేలు ఇస్తే.. నేను రూ.15 వేలు ఇస్తా. నవంబర్‌లో తీసుకుంటే రూ.10 వేలు.. డిసెంబర్లో తీసుకుంటే రూ.15 వేలు’ అంటూ సవాళ్లు విసిరారని గుర్తుచేశారు. కానీ ఇవాళ మొత్తం అన్నీ ఎగ్గొట్టి తులం బంగారం ఇవ్వలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు హాలిడే ఇచ్చారని, పవర్ హాలిడే, క్రాప్ హాలిడే పరిస్థితులు తీసుకొచ్చారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రాన్ని దివాలా తీయించి, గబ్బు లేపారని విమర్శించారు. ‘రైతుబంధు బంద్ అయింది. కానీ ఢిల్లీ ఖాతాలో మాత్రం పైసలు బరాబర్ పడుతున్నాయి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఈఎంఐ కట్టాలి కదా.. కట్టకపోతే పోస్టు ఊష్ అవుతుంది కదా. అందుకే ముఖ్యమంత్రి రెగ్యులర్‌గా ఢిల్లీకి వెళ్తున్నారు. వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్లి కప్పం కట్టాలి.. ఈఎంఐ కట్టాలి. లేకపోతే అక్కడ రెన్యూవల్ కాదు.. మళ్లీ టికెట్ వేయరు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘రైతుబంధు బంద్ అయింది కానీ రాహుల్ గాంధీ బందు మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది. ఆయన ఖాతాలో మాత్రం టకీ టకీ టకీ టకీ మని పైసలు జోరుగా పడుతున్నాయి’ అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొత్తగా ఒక్క పని అయినా చేశారా? ఒక్క మంచి కార్యక్రమమైనా చేపట్టారా? అని ప్రశ్నించారు.
చెడు చేసినవారిని కూడా యాదిలో పెట్టుకోవాలి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మహాకవి సామల సదాశివ రాసిన ‘యాది’ పుస్తకాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. మనిషికి యాది ఎంతో ముఖ్యమని, మంచి చేసినవారిని గుర్తుంచుకోవాలని, గుండెల్లో పెట్టుకోవాలని అన్నారు. అదే సమయంలో చెడు చేసినవారిని కూడా మర్చిపోకూడదని వ్యాఖ్యానించారు.
‘మంచి చేసినోని యాది పెట్టుకోవాలి.. గుండెల్లో పెట్టుకోవాలి. అట్లాగే చెడు చేసినోని కూడా యాది పెట్టాలి. వంద ఫీట్ల బొంద తీసి పాతిపెట్టాలి.. వదిలిపెట్టొద్దు. యాది మర్చిపోతే ఆగమైపోతాం’ అని కేటీఆర్ అన్నారు.
కవి కాళోజీ నారాయణరావు చెప్పిన ‘కసి ధీర బుస కొడుతూ ఉండాలి.. కాలంబు రాగానే కాటేసి తీరాలి’ అనే మాటలను గుర్తుచేశారు. అందుకే గతంలో ఎవరు ఏం చేశారో, ఎవరు మంచి చేశారు.. ఎవరు చెడు చేశారో ప్రజలు మర్చిపోవద్దని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | మూడు నెలల్లో పిల్లలు పుడతారా అన్న రేవంత్.. మరి మూడేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదు.. రైతు గర్జనలో నిలదీసిన కేటీఆర్
KTR | ఎగ్గొట్టినదానితో కలిపి ఎకరానికి రూ.60వేల రైతుబంధు వెంటనే చెల్లించాలి.. కేటీఆర్ డిమాండ్
KTR | ఇప్పుడు బెల్ట్ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి.. రిటైర్డ్ ఇంజినీర్ల మీద రేవంత్ రెడ్డి బూతులపై కేటీఆర్ ధ్వజం
Diwali Parole | దీపావళి సందర్భంగా.. 143 మంది ఖైదీలకు పెరోల్
KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

