KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మృతిచెందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
KTR | ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మృతిచెందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘బంగారం లాంటి 24 మంది చిన్నారులు అగ్నిప్రమాదంలో ఆగమయ్యారు. ఏడుగురు పిల్లలు చనిపోయారు. మిగతా చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ పిల్లల కుటుంబాలకు పార్టీ తరఫున కొంత ఆర్థిక సాయం అందించి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం’ అని తెలిపారు.
ఆదిలాబాద్ డైట్ మైదానంలో నిర్వహించిన రైతు గర్జన సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిమ్స్ అగ్నిప్రమాద ఘటనకు ఎలుకలే కారణమని ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు. ‘పిల్లలు ఎందుకు చనిపోయారని అడిగితే ఎలుకలట.. ఎలుకల వల్ల ఏడుగురు పిల్లలు చనిపోయారట. మరి ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది నల్లమల్ల పిల్లి కదా? ఆ నల్లమల్ల పిల్లికి ఎలుకలను కూడా పట్టడం చేతకావడం లేదా? ఎలుకలను పట్టడానికి కూడా సాధ్యం కావడం లేదా? ఇంకెందుకు నువ్వు ముఖ్యమంత్రి?’ అంటూ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఆ బంగారు ప్రాణాలను ఎవరు తిరిగి తెచ్చిస్తారు ముఖ్యమంత్రి గారూ? మీ ప్రభుత్వానికి సిగ్గుందా? కనీస సంస్కారం ఉందా?’ అని ప్రశ్నించారు.
రిమ్స్ ఘటనలో బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని కేటీఆర్ తెలిపారు. జోగు రామన్న, కోవాలక్ష్మి, అనిల్ జాదవ్, సత్యవతి రాథోడ్ తదితరులు బాధిత కుటుంబాల తరఫున పరిహారం చెల్లించాలని కోరారని చెప్పారు. ‘కనీసం ఆ పిల్లలను కాపాడలేకపోయారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అడిగినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సడి లేదు.. చప్పుడు లేదు’ అని విమర్శించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ‘నా భార్య ఇజ్జత్ తీస్తుంది.. బతకాలని లేదు’.. తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపి యువకుడు అదృశ్యం
Lateef Bhat: మసీదులో దాక్కున్న లతీఫ్ భట్.. కుల్గాం ఎన్కౌంటర్లో హతం
Cyclone Akvan | ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. తీవ్ర తుపానుగా బలపడిన వాయుగుండం!
Russian Plane Crash | రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం.. 19 మంది మృతి!
Javed Akhtar: ప్రతి భారతీయుడి రక్తంలో రాముడున్నాడు.. జావెద్ అక్తర్ వ్యాఖ్యలను ఖండించిన ముస్లిం నేత
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

