Traffic Restrictions | సిటీబ్యూరో: కొత్త ఏడాది సందర్భంగా మూడు కమిషనరేట్ పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ వే మార్గాన్ని కూడా మూసివేయనున్నట్టు తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వెళ్లే వాహనాలకు మినహా మేరే ఇతర వాహనాలకు అనుమతి లేదని పేర్కొన్నారు.
ఈ మార్గాల్లో వెళ్లే వాహనదారులు, డ్రైవర్లు డ్రెస్‌కోడ్, రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనలు పాటించకుండా వ్యవహరించే వాహనదారుల సమాచారం 9490617646 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. నగరంలో బేగంపేట, టోలిచౌకీ మినహా అన్నీ ఫ్లై ఓవర్లు మూసివేయనున్నట్టు తెలిపారు. ప్రైవేట్ బస్సులు, లారీలు, హెవీ గూడ్స్ వాహనాలు రాత్రి 10 నుంచి ఉదయం 2 గంటల వరకు అనుమతించబోమని వివరించారు.