Traffic Restrictions | సిటీబ్యూరో, జూన్ 27(నమస్తే తెలంగాణ): గోల్కొండ బోనాల సందర్భంగా టాఫ్రిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బోనాల ప్రత్యేక పూజల సందర్భంగా ఈ నెల 29, జూలై 3, 6, 10, 13, 17, 20, 24 తేదీల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
గోల్కొండలోకి ప్రవేశించే రామ్‌దేవ్‌గూడ మక్క యి దర్వాజా, లంగర్ హౌజ్ ఫతేదర్వాజా, సెవెన్ టూంబ్స్ బంజారా దర్వాజా వైపు నుంచి ఎలాంటి వాహనాలకు అనుమతి ఉండదని జాయింట్ కమిషనర్ తెలిపారు. అయితే ఈ మార్గాల ద్వారా వచ్చే వాహనాలకు ఆయా ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రతిఒక్కరూ ట్రాఫిక్పోలీసులకు సహకరించాలని జోయల్‌డేవిస్ కోరారు.
డిఫెన్స్ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను రంగారెడ్డి జిల్లా ఎన్‌ఫొర్స్‌మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 100 పైపర్స్ బాటిళ్లు 12, బెండర్స్ప్రైడ్ బాటిళ్లు 3, రెండు బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ జీవన్ కిరణ్ కథనం ప్రకారం నగరానికి చెందిన ముత్యాల భానుచందర్, ముత్యా ల అఖిలేష్ సాగర్ శుక్రవారం మధ్యాహ్నం అత్తాపూర్ ప్రాంతంలో అక్రమంగా డిఫెన్స్ మద్యం రవాణా చేస్తుండగా ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుభాష్ చందర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు బృందం దాడులు జరిపి నిందితులను అరెస్టు చేశారు.