Uppal Stadium | హైదరాబాద్ : ఈ నెల 9వ తేదీన ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్( IPL Match ) జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు ఉప్పల్ స్టేడియం( Uppal Stadium ) పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు( Traffic Restrictions ) విధిస్తున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్( CP DS Chauhan ) వెల్లడించారు.
సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కొనసాగనుంది. ఈ సందర్భంగా వరంగల్ హైవే నుంచి సిటీలోకి వచ్చే భారీ వాహనాలను చెంగిచర్ల ఎక్స్ రోడ్స్, చర్లపల్లి, ఐఓసీఎల్, ఎన్ఎఫ్సీ వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు. ఎల్బీనగర్ నుంచి వచ్చే వాహనాలు, నాగోల్ మెట్రో స్టేషన్, హెచ్ఎండీఏ, బోడుప్పల్, చెంగిచర్ల ఎక్స్ రోడ్డు వైపు మళ్లించనున్నారు. అలాగే మల్లాపూర్ నుంచి నాచారం ఐడీఏ వచ్చే వాహనాలు నాచారం ఐడీఏ, చెర్లపల్లి, చెంగిచర్ల మీదుగా మళ్లించనున్నట్లు సీపీ పేర్కొన్నారు.