హైదరాబాద్: బక్రీద్ సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముస్లి సోదరుల ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో శనివారం ఉదయం 11.30 గంటల వరకు మీరాలం ట్యాంక్ ఈద్గా దగ్గర ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. పురానాపూల్, కామటిపుర, కిషన్‌బాగ్ నుంచి మీరాలం ఈద్గా వైపు వచ్చే ప్రార్థన చేసుకోవడానికి వచ్చే వాహదారులను బహదూర్‌పుర క్రాస్ రోడ్స్ మీదుగా అనుమతించిన జనరల్ వాహనదారులను మన్మోహన్సింగ్ ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తామని తెలిపారు.
శివరాంపల్లి, దానమ్మ గుడిసెల మీదుగా ప్రార్థనల కోసం వచ్చే వారిని దానమ్మహట్స్ క్రాస్‌రోడ్స్ మీదుగా శాస్తిపురం, ఎన్ఎస్కుంట వైపు మళ్లిస్తారు. కాలాపత్తర్ నుంచి ఈద్గావైపుకు వచ్చే వారిని కాలాపత్తర్ ఎల్ అండ్ ఓ పీఎస్ మీదుగా పంపుతారని, మోచి కాలనీ, బహదూర్‌పుర, శంషీర్‌గంజ్, నవాబ్‌సాహెబ్ కుంట మీదుగా మళ్లిస్తారని చెప్పారు. పురానాపూల్ నుంచి బహదూర్‌పుర వైపు వెళ్లే వాహనాలను జియాగూడ, సిటీకాలేజ్ మీదుగా మళ్లిస్తామని, శంషాబాద్, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి నుంచి బహదూర్‌పుర వైపు వచ్చే హెవీ వాహనాలను మన్మోహన్సింగ్ ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తారు.