సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు సైబరాబాద్ పోలీసులు దేశంలోనే తొలిసారిగా ట్రాఫిక్ మార్షల్స్‌ను రంగంలోకి దింపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు వీరు సహకరిస్తున్నారు.
ఐటీ కంపెనీల సహకారంతో ఎంపిక చేసిన వారికి ట్రాఫిక్ నియమాలు, చట్టాలపై పూర్తిస్థాయి అవగాహన, ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం 83 మంది ట్రాఫిక్ మార్షల్స్ సేవలందిస్తున్నారు. ఈనెల 12న విధుల్లోకి చేరిన వీరు.. ప్రధానంగా ఐటీ కారిడార్‌లోని బాటిల్‌నెక్, అత్యంత రద్దీగా ఉండే జంక్షన్ల వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి వివిధ ఐటీ కంపెనీల సహకారంతో గౌరవ వేతనం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.