Hyderabad | బేగంపేట, అక్టోబర్ 23: చిరు వ్యాపారులపై ట్రాఫిక్ పోలీసులు మరోసారి ప్రతాపం చూపారు. బుధవారం సికింద్రాబాద్, రాణిగంజ్, బేగంపేట ఏరియాల్లో భారీ బందోబస్తు నడుమ ట్రాఫిక్ పోలీసులు, బేగంపేట సర్కిల్ జీహెచ్ఎంసీ సిబ్బంది సంయుక్తంగా ఫుట్‌పాత్‌లపై ఉన్న చిరు వ్యాపారాలను తొలగించారు.
వ్యాపార వాణిజ్య కేంద్రమైన రాణిగంజ్‌లో రెండు రోజులుగా ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు ఆధ్వర్యంలో రాణిగంజ్, మినిస్టర్ రోడ్డు, బేగంపేట ప్రకాశ్‌నగర్, ప్రధాన రహదారి ప్రాంతాల్లో ఆక్రమించిన ఫుట్‌పాత్ వ్యాపారాలను పూర్తిగా తొలిగించారు.ట్రాఫిక్ పోలీసులకు మామూళ్లు అవసరమైన ప్రతిసారి ఇలా స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టడం పరిపాటిగా మారిందని దుకాణదారులు ఈ సందర్భంగా మండిపడ్డారు.