నేటి నుంచి ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
నగరంలో రాంగ్‌సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ఉల్లంఘనలపై సోమవారం నుంచి ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ మొదలవుతోంది. గత వారం రోజులుగా ఈ ఉల్లంఘనలపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు.. సోమవారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చలాన్ విధించనున్నారు
- రాంగ్‌సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ఉల్లంఘనలపై చలాన్
- రూల్స్ పాటించండి… ప్రమాదాలు తగ్గించండి : ట్రాఫిక్ పోలీసులు
సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): నగరంలో రాంగ్‌సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ఉల్లంఘనలపై సోమవారం నుంచి ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ మొదలవుతోంది. గత వారం రోజులుగా ఈ ఉల్లంఘనలపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు.. సోమవారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చలాన్ విధించనున్నారు. ఈ మధ్యకాలంలో నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై ట్రాఫిక్ పోలీసులు అధ్యయనం చేయగా.. ఈ రెండు ఉల్లంఘనల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాహనదారులతో పాటు పాదచారులు కూడా ప్రమాదాలకు గురవుతున్నట్లు పోలీసుల అధ్యయనంలో వెల్లడైంది.
ఈ క్రమంలో పోలీసులు గత వారం రోజులుగా వాహనదారులకు ఈ రెండు ఉల్లంఘనలపై అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. సీనియర్ అధికారులు సైతం పాల్గొని రాంగ్‌సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌తో జరిగే ప్రమాదాలను వివరించారు. సోమవారం నుంచి ఒకపక్క అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూనే.. మరోపక్క స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఉల్లంఘనలపై చలాన్ కూడా విధించనున్నారు. అయితే, ద్విచక్ర వాహనాలు, ఆటోలతో ప్రమాదాలుగా తక్కువగా ఉన్న నేపథ్యంలో.. వాటిపై విధించే జరిమానాలు కూడా తక్కువగానే ఉంటాయని అధికారులు చెప్పారు. భారీ వాహనాలు రాంగ్రూట్లో రావడంతో నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బైక్‌లు, ఆటోలకు విధించే జరిమానాలతో పోలిస్తే.. భారీ వాహనాలకు విధించే జరిమానాలు ఎక్కువేనని చెప్పారు. మధ్య తరగతి ప్రజలు నడిపించే వాహనాలైన బైక్‌లు, ఆటోలపై విధించే జరిమానాలు గతంతో పోలిస్తే తక్కువగానే ఉంటాయని తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రమాదాలు తగ్గించాలని సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారి ఒకరు వాహనదారులను కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

