ఈ నెల 31 వరకు సైబరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
Cyberabad | సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓల్డ్ అల్వాల్ రోడ్డు రేపట్నుంచి జనవరి 31వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. రెడ్డి ఎన్క్లేవ్ జ్యోతి నగర్ వద్ద నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓల్డ్ అల్వాల్ రోడ్డు రేపట్నుంచి జనవరి 31వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. రెడ్డి ఎన్క్లేవ్ జ్యోతి నగర్ వద్ద నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు.
రాజీవ్ రహదారి నుంచి సుచిత్ర వైపు వచ్చే వాహనాలను ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద మళ్లించనున్నారు. శ్రీ బేకరీ, అంబేద్కర్ విగ్రహం, అల్వాల్ ఐజీ స్టాచ్యూ వైపు మళ్లిస్తారు.
సుచిత్ర, అల్వాల్ ఐటీ స్టాచ్యూ నుంచి రాజీవ్ రహదారి వైపు వెళ్లే వాహనాలను అల్వాల్ ఐటీ స్టాచ్యూ వద్ద మళ్లిస్తారు. అంబేద్కర్ విగ్రహం, శ్రీ బేకరి, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. మీ సేవా గోల్నాక మీదుగా రాజీవ్ రహదారి వైపునకు వాహనాలను అనుమతిస్తారు. ఈ నెల రోజుల పాటు వాహనదారులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

