సిటీబ్యూరో, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ ) : బాణాసంచా (పటాకుల షాపులు) విక్రయ దుకాణదారులు తప్పనిసరిగా జీహెచ్ఎంసీ నుంచి తాతాలిక ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని, లైసెన్స్ లేకుండా షాప్ పెట్టుకోవడానికి అనుమతి లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి స్పష్టం చేశారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు రిటైల్ షాపులకు రూ.11 వేలు, హోల్‌సేల్ షాపులకు రూ.66 వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు. బాణాసంచా దుకాణాల నిర్వాహకులు ప్రతి ఒకరూ తప్పనిసరిగా లైసెన్స్ పొం ది నిబంధనల మేరకు దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పటాకుల దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారంతా నిర్ణీత ఫీజును చెల్లించి జీహెచ్ఎంసీ నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని అన్నారు. తాతాలిక ట్రేడ్ ఐడెంటిఫికేషన్ నంబర్ కోసం సిటిజన్ సర్వీస్ సెంటర్, జీహెచ్ఎంసీ వెబ్సైట్ (www.ghmc.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. డిమాండ్ డ్రాఫ్ట్, డెబిట్/క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాం కింగ్ ద్వారా ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించవచ్చన్నారు. అదేవిధంగా తమ గుర్తింపు రుజువుకు ఆధార్ కార్డు, పాన్ కార్డు కాఫీ ఇవ్వాలని కో రారు. బాణాసంచా షాపులను ఫుట్‌పాత్‌లు, జనావాసాల మధ్య ఏర్పాటు చేయరాదని తెలిపారు. కాలనీ, బస్తీలకు దూరంగా ఓపెన్ గ్రౌండ్లో, పెద్దహాల్లో తగిన ఫైర్ సేఫ్టీతో షా పులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే మంటలను ఆర్పడానికి వీలుగా అగ్నిమాపక నిరోధక పరికరా లు అందుబాటులో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. దుకాణాలకు దగ్గరగా ఎట్టి పరిస్థితుల్లోనూ బాణాసంచా కాల్చకూడదని, షాపులో ఏర్పాటు చేసే లైట్లు ఇతరత్రా కరెంటు పరికరాలకు నాణ్యమైన విద్యుత్ వైర్‌ను వినియోగించాలని సూచించారు. స్టాల్లో ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగినట్లయితే స్టాల్ హోల్డర్దే బాధ్యతని, చట్టపరమైన చర్యలకు బాధ్యుడని తాతాలిక ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్లో స్పష్టంగా పేరొనడం జరుగుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సూచించారు. సుప్రీం కోర్టు, హైకోర్టు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు టైం టు టైం జారీచేసే అన్ని ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని తెలిపారు. ఫైర్ క్రాకర్స్ అయిన సిరీస్ క్రాకర్స్, లడీస్ తయారీ, అమ్మకాలు, వినియోగించడం నిషేధించడం జరిగిందని, వాటి అమ్మకాలకు అనుమతించరని స్ప ష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఆక్ట్ 1955, న్యాయస్థానాలు, పీసీబీ, ప్రభుత్వ ఉత్తర్వులు, మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లయితే తాతాలిక ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్ రద్దు చేయడం జరుగుతుందని కమిషనర్ స్పష్టం చేశారు.