మేడ్చల్ మల్కాజిగిరి, సెప్టెంబరు 15 : వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ట్రాక్టర్ డ్రైవర్‌పై(Tractor driver )వినాయక విగ్రహం(Vinayaka idol) పడటంతో ప్రమాదవశాత్తు నీటి మునిగి మృతి(Died) చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ మండల పరిధిలోని రాజొల్లారం తండాకు కరంటోడ్ లక్ష్మణ్(28) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
కాగా, తండాలో ప్రతిష్టించిన వినాయకుడిని పటేల్ చెరువులో నిమజ్జనం చేసేందుకు స్థానికులతో కలిసి వెళ్లాడు. నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు అతడిపై వినాయక విగ్రహం పడింది. దీంతో నీటి మునిగి మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. లక్ష్మణ్ మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.