సిటీబ్యూరో: అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో ప్రైవేట్ సెక్యూరిటీ అవసరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఈ నేపథ్యంలో ఈ నెల 30న హైదరాబద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ) ఆధ్వర్యంలో నేషనల్ ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్-2024ను నిర్వహిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. హెచ్సీఎస్సీకి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, కన్వీనర్‌గా అదనపు కమిషనర్(లా అండ్ అర్డర్) విక్రమ్ సింగ్ మాన్, సెక్రటరీ జనరల్‌గా శేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్, జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ ఫిజికల్ సెక్యూరిటీ ఫోరం ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమ్మిట్ ముగింపులో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా సమ్మిట్ లోగోను విడుదల చేశారు.