Amberpet | అంబర్ పేట, జూన్ 16: అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈనెల 17వ తేదీ మంగళవారం కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని సీబీడీ, ఏడీఈజీ నాగేశ్వరరావు తెలిపారు. వాటి వివరాలను వెల్లడించారు. చెట్ల నరికివేత, లైన్ ఏబీ స్విచ్లు, డీటీఆర్ ఏబీ స్విచ్లు, జంపర్లు సరిదిద్దడం వంటి నిర్వహణ పనుల నేపథ్యంలో కరెంటు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.
(1) 11కేవీ ఫీవర్ హాస్పిటల్ ఫీడర్ (33/11 కేవీ ఫీవర్ హాస్పిటల్ ఎస్ఎస్) పరిధిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు: ఫీవర్ హాస్పిటల్, అంజయ్య క్వార్టర్స్, తెలంగాణ యువతి మండలి, బర్కత్పురా పెట్రోల్ బంక్ ప్రాంతాలు.
(2)11కేవీ బీకేపీ బస్ డిపో ఫీడర్ (33/11 కేవీ ఫీవర్ హాస్పిటల్ ఎస్ఎస్) పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు: లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయం, రత్న నగర్, అరవింద్ డిగ్రీ కళాశాల పరిసర ప్రాంతాలు.
(3)11కేవీ కాచిగూడ రైల్వే స్టేషన్. ఫీడర్ (33/11 కెవి ఫీవర్ హాస్పిటల్ ఎస్ఎస్) మధ్యాహ్నం 3-30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా ఉండని ప్రాంతాలు: రత్ననగర్, కాచిగూడ రైల్వే స్టేషన్, కాచిగూడ బస్ డిపో, బీజేపీ ఆఫీస్ లేన్, పారగాన్ అపార్ట్మెంట్ లేన్ , చుట్టుపక్కల ప్రాంతాలు.