వ్యవసాయ యూనివర్సిటీ (హైదరాబాద్), మార్చి 06: టమాటకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని ,వాతావరణ పరిస్థితుల తట్టుకొని అధిక దిగుబడులను ఇచ్చే హైబ్రిడ్ రకాలను మరిన్ని మార్కెట్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ దండా రాజిరెడ్డి అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఉద్యాన కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన నాణ్యత నిచ్చే నూతన టమాట రకాల రూపకల్పనపై అంతర్జాతీయ వర్క్ షాప్‌నకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో వాతావరణ పర్యావరణ మార్పులు వైరస్ తెగుళ్లు, చీడపీడలను తట్టుకునే రకాలు అధిక దిగుబడులను ఇచ్చే పరిశ్రమలకు అనుగుణంగా ఉండే ప్రాసెసింగ్ టమాట హైబ్రిడ్ రకాలను రూపొందిస్తే ఎగుమతికి అవకాశాలు పెరుగుతాయన్నారు.
వేసవిలో టమాటను ఎక్కువగా నష్టపరిచే సూది పురుగు ఎల్లో లీఫ్ కలర్ వైరస్ తెగుళ్లు 42 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మంచి దిగుబడి నిచ్చే రకాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. నూతన రకాలలో అభివృద్ధిలో దేశంలో సైతం టమాటల్లో కొరతను తీర్చవచ్చుఅన్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఉత్పాదకత సాధించాలంటే హైబ్రిడ్ రకాలే శరణ్యమని ఆయన సూచించారు. సీడ్ బ్రీడింగ్ బయోటెక్నాలజీ సంకర రకాల అభివృద్ధిపై పరిశోధనలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌లో 0.45 8 0 విస్తీర్ణంలో 7.277 మిలియన్ మెట్రిక్ టన్నుల దిగుబడిని ఇస్తుందన్నారు. బీహార్, కర్ణాటక ,ఉత్తరప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో టమాటా పండిస్తున్నారు.
వైరస్ తెగుళ్లను అధిక వేడిని తట్టుకునేందుకు అవసరమైన జన్యూలను ఆవిష్కరించి టమాట రకాలలో జొప్పించామని, వాటిని త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా రైతులకు అందుబాటులో తీసుకువస్తామని, తైవాన్ దేశ అంతర్జాతీయ కూరగాయల పరిశోధన కేంద్రం టమాట బ్రీడింగ్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ అసఫ్ బబిజిస్ అన్నారు. పరిశోధన ఫలితాలను కాన్ఫరెన్స్ జనరల్ కార్యదర్శి అసోసియేట్ ప్రొఫెసర్ పిడుగుల పిడిగం సైదయ్య, వర్సిటీ డీన్ రాజశేఖర్, పరిశోధన సంచాలకులు డాక్టర్ లక్ష్మీనారాయణ అంతర్జాతీయ ప్రోగ్రాం డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఉద్యాన కళాశాల అసోసియేట్ దిన్ డాక్టర్ పిండి సైదయ్య పిండి ప్రశాంత్ మోజార్ల ఉద్యాన కళాశాల అసోసియేటెడ్ పీ .సైదయ్య, ప్రపంచ కూరగాయల కేంద్రం సైంటిస్ట్ అధికారి డాక్టర్ వై శ్రీనివాస్ రెడ్డి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ పరిశోధన విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.