Road accident : నగరంలోని నార్సింగి ఏరియాలో దీపావళి వేళ విషాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు బైకును డీకొట్టడంతో ఓ చిన్నారి దుర్మరణం పాలయ్యాడు. అతడి తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. అల్కపురి కాలనీ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు డ్రైవర్ నిరక్ష్యంగా డ్రైవ్ చేయడంవల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
నార్సింగికి చెందిన నవీన్ కుమార్ తన కుమారుడు కుశాల్ జోయల్తో కలిసి పటాసులు కొనుగోలు చేసేందుకు బైకుపై ఖాజాగూడకు వెళ్లారు. పటాసులు కొన్న తర్వాత తిరిగి వస్తుండగా వేగంగా దూసుకొచ్చిన కారు అల్కపురి వద్ద వారి బైకును ఢీకొట్టింది. దాంతో తండ్రీ కొడుకు ఇద్దరూ గాల్లో ఎగిరి కిందపడ్డారు.
కుశాల్పై నుంచి కారు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ తండ్రి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రవీణ్ కుమార్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి అతివేగంగా కారు నడపడమే ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తు్న్నట్లు పోలీసులు చెప్పారు.