అబిడ్స్, ఫిబ్రవరి 5 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితులు సమాజంలో గౌరవంగా బతకాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని, దీంతో వారి జీవితాలలో వెలుగులు నింపుతున్నారని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ ఎం.ఎస్. ప్రభాకర్‌రావు అన్నారు. గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని గోడేకిఖబర్ డబుల్ బెడ్రూం ప్రాంగణంలో గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో ఐదవ విడత దళితవాడలో బస యాత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. గోషామహల్ నియోజకవర్గంలో గడ్డం శ్రీనివాస్‌యాదవ్ నేతృత్వంలో దళితవాడలో బస యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. గడ్డం శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. దళితవాడలో బసయాత్రకు విశేష స్పందన లభిస్తుందని, పోటీ పరీక్షలకు పాల్గొనే అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు నోట్స్ అందజేస్తున్నామని తెలిపారు. అంతకు ముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు ఆల్ల పురుషోత్తంరావు, మాజీ కార్పొరేటర్ రాంచందర్‌రాజు, కవిత, జైభీం నవయువక సంఘం అధ్యక్షుడు కె. భిక్షపతి, అర్జున్, వైస్ చైర్మన్ శంకర్, నాయకులు సతీశ్, వికాస్, ప్రభా, ప్రవీణ్, అంజయ్య, రాము, అశోక్, డి. అర్జున్ పాల్గొన్నారు.