RGIA | హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్టులో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎయిర్పోర్టు భద్రతా సిబ్బందిని కేంద్ర నిఘా సంస్థలు అప్రమత్తం చేశాయి. ఎయిర్పోర్టుకు వచ్చే ప్రతి వాహనాన్ని సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తోంది. ప్రతి ఒక్కరి కదలికలపై కూడా నిఘా పెట్టింది. ఈ నెల 28వ తేదీ వరకు సందర్శకుల పాసులను కూడా అధికారులు రద్దు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల వెంట ఎక్కువ మంది రావొద్దని శంషాబాద్ డీసీపీ సూచించారు.