Hyderabad | గ్యాస్ లీకేజీ ఘటనలో మరో ముగ్గురి మృతి
Hyderabad | హైదరాబాద్ దోమలగూడలో భారీ అగ్నిప్రమాదం ఘటనలో మరో ముగ్గురు మృతి చెందారు. ఈనెల 11న రోజ్ కాలనీలోని ఓ ఇంట్లో పిండి వంటలు చేస్తుండగా గ్యాస్ లీకేజీ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. గాయాల పాలైన పద్మ (53), ఆమె కూతురు ధనలక్ష్మి (28), ధనలక్ష్మి కుమారుడు అభినవ్ (7) గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయారు.
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ దోమలగూడలో భారీ అగ్నిప్రమాదం ఘటనలో మరో ముగ్గురు మృతి చెందారు. ఈనెల 11న రోజ్ కాలనీలోని ఓ ఇంట్లో పిండి వంటలు చేస్తుండగా గ్యాస్ లీకేజీ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఏడుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయాల పాలైన పద్మ (53), ఆమె కూతురు ధనలక్ష్మి (28), ధనలక్ష్మి కుమారుడు అభినవ్ (7) గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత పడటంతో బంధువుల రోదనలు మిన్నంటాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

