వసూలైంది రూ.61 కోట్ల 53 లక్షలు
ముమ్మరంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూలు
వందశాతం వసూళ్లకు ప్రణాళిక
హిమాయత్‌నగర్,మార్చి 2: జీహెచ్ఎంసీ అంబర్‌పేట సర్కిల్-16 అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూలును ముమ్మరం చేశారు. ఈ ఏడాది మార్చి 31తో పూర్తియ్యే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లైసెన్స్ ఫీజు వసూలు లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. లైసెన్స్ రెన్యూవల్ ఫీజు చెల్లించని వారి నుంచి వసూలు ఏ విధంగా చేయాలనే ఆలోచనతో అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేసే వారిపై జరిమానాలు విధించే దిశగా ఆలోచన చేస్తున్నారు. లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి సాధ్యమైనంత త్వరగా లైసెన్స్ జారీ చేసే విధంగా చర్యలు తీసుకుంటూనే మరోపక్క లైసెన్స్ తీసుకోకుండా నిర్లక్ష్యం వహించే వారిపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధం అవుతున్నారు.సర్కిల్ పరిధిలో ఉన్న వ్యాపార సంస్థల నుంచి ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూలు చేసేందుకు నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. వ్యాపార లావాదేవీలు నిర్వహించే ప్రతి సంస్థ జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.కొంత మంది వ్యాపారస్తులు,ప్రైవేట్ హాస్టల్స్ నిర్వాహకులు ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటే అడ్రస్,లావాదేవీలు బయటకు తెలిసే అవకాశం ఉందని ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండా వ్యాపారం చేస్తున్న వారిని సైతం గుర్తించి ఫీజు వసూలు చేస్తు న్నారు.ఈ ఏడాది ట్రేడ్ లైసెన్స్ ఫీజు లక్ష్యం రూ.69 కోట్లు ఉండగా,ఆయా వ్యాపార సంస్థల నుంచి ఇప్పటి వరకు రూ.61 కోట్ల 53 లక్షలను అధికారులు వసూలు చేశారు.
లక్ష్యాన్ని అధిగమిస్తాం
ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించని వ్యాపార సంస్థలు,ప్రైవేట్ హాస్టల్ నిర్వాహకులు సకాలంలో చెల్లించి లైసెన్స్‌ను రెన్యూవల్ చేయించుకోవాలి. వ్యాపారస్తులు ఇంటి నంబర్,పాన్‌కార్డు, ఆధా ర్‌కార్డు జిరాక్స్‌లతో దరఖాస్తు చేసిన వెంటనే లైసెన్స్ జారీ చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం.గడువులోగా వ్యాపారులందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి.
–డాక్టర్ జ్యోతిబాయి ,అంబర్‌పేట సర్కిల్-16 ఏఎం హెచ్ వో