విభజన.. వింతలు
అధికారుల నిర్లక్ష్యం, అనాలోచిత నిర్ణయాలు సామాన్య ప్రజలను ఏ విధంగా ఇకట్లకు గురిచేస్తాయో చెప్పడానికి ట్రై కార్పొరేషన్లో నూతనంగా ఏర్పడిన సరిళ్ల విభజనే నిదర్శనం. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా, కేవలం కాగితాలపై గీసిన గీతల ఆధారంగా చేసిన సరిళ్ల విభజనతో ఇప్పుడు ఇండ్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు.
- ఇల్లు మౌలాలీలో.. ట్యాక్స్ కీసరలో
- ట్రై కార్పొరేషన్లో కొత్తగా ఏర్పడిన సర్కిళ్లలో చిత్ర విచిత్రాలు
- ఒకే వీధిలోని రెండు ఇళ్లకు రెండు వేర్వేరు సర్కిళ్లు కేటాయింపు
- ఇంటి ట్యాక్స్, బిల్లులు కట్టేందుకు యజమానులకు తప్పని తిప్పలు
- అధికారుల తీరుపై ఆగ్రహం, రీ సర్వే చేయాలని డిమాండ్
అధికారుల నిర్లక్ష్యం, అనాలోచిత నిర్ణయాలు సామాన్య ప్రజలను ఏ విధంగా ఇకట్లకు గురిచేస్తాయో చెప్పడానికి ట్రై కార్పొరేషన్లో నూతనంగా ఏర్పడిన సరిళ్ల విభజనే నిదర్శనం. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా, కేవలం కాగితాలపై గీసిన గీతల ఆధారంగా చేసిన సరిళ్ల విభజనతో ఇప్పుడు ఇండ్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. ఇళ్లు ఒక సర్కిల్లో ఉంటే…ఆస్తి పన్ను చెల్లింపు మాత్రం మరో సర్కిల్లోకి రావడం స్థానికంగా తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది.
ఉదాహరణకు మల్కాజిగిరి జోనల్ పరిధిలోని మౌలాలి సర్కిల్ ఆదర్శనగర్కు చెందిన ఇంటి యాజమాని వీవీఎస్ఎస్ఏ రమేష్ వర్మకు ట్యాక్స్ (పీటీఐఎన్ నంబర్-1170767155) చెల్లింపు ఇందుకు నిదర్శనం. రమేష్ వర్మకు గతంలో మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో ఇంటి ట్యాక్స్ఉండేది. అయితే కొత్తగా మౌలాలి సర్కిల్ ఏర్పాటుతో మౌలాలి సర్కిల్ పరిధిలోకి ఆదర్శనగర్ ప్రాంతం వచ్చింది.
దీంతో ట్యాక్స్కట్టేందుకు సదరు యజమాని ప్రయత్నించగా ప్రస్తుతం మీ ఇంటి నంబర్ కీసర సర్కిల్లో కేటాయించారని తెలపడంతో అవాక్కైయ్యాడు. అధికారులు చేసిన తప్పుకు ఇంటి యాజమానులను కార్యాలయాల చుట్టూ తిరగాలని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే మెజార్టీ సర్కిళ్లలో ఇదే పరిస్థితి ఉండటం గమనార్హం.
సిటీబ్యూరో/మల్కాజ్గిరి జూన్ 30 (నమస్తే తెలంగాణ): ట్రై కార్పొరేషన్ పరిధిని విస్తరిస్తూ, పరిపాలనా సౌల భ్యం కోసం అంటూ కొత్తగా 30 సర్కిళ్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ విభజన ప్రక్రియలో కనీస నిబంధనలు పాటించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒకే వీధిలోని ఇండ్ల ను రెండు వేర్వేరు సర్కిళ్లుగా విభజించడమే కాకుండా.. నివాసముంటున్న ఇల్లు ఒక సర్కి ల్ పరిధిలో ఉంటే, ఆ ఇంటి నంబర్, ట్యాక్స్ రికార్డులు మా త్రం పక సరిల్ ఆఫీసులో చూపిస్తున్నారు. దీంతో ట్యాక్స్ కట్టడానికి వెళ్లిన జనాలకు ఏ ఆఫీస్ కి వెళ్లాలో తెలియక, అకడకెళ్తే ఇకడికి.. ఇకడికొస్తే అకడికి పొమ్మం టూ అధికారులు తిప్పుతుండటంతో బాధితులు తలలు పట్టుకుంటున్నారు. ట్యాక్స్ అసెస్మెం ట్ నంబర్లు ఒక సర్కిల్లో, భౌతికంగా ఇల్లు మరో సరిల్లో ఉండటంతో ఆన్లైన్ పేమెంట్లు కూడా కావడం లేదని యజమానులు వాపోతున్నారు.
ముఖ్యంగా నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు తమ ఆస్తి పన్ను చెల్లించడానికి, చిన్న, చిన్న సమస్యల పరిషారం కోసం కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్త సరిల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త సర్కిళ్ల ఏర్పాటుతో సమస్యలు పరిషారం కావాల్సింది పో యి, కొత్త సమస్యలు తీసుకువచ్చారం టూ స్థానికులు మండిపడుతున్నారు. ఇండ్లు ఎకడ ఉంటే.. ఆస్తుల పన్ను రికార్డులు కూడా అదే సర్కిల్ పరిధిలోకి వచ్చేలా డేటాను రీ-మ్యాపింగ్ చేయాలని, ప్రజలను ఇబ్బందుల పాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

