సంక్రాంతికి ఊరెళ్తున్నారా..? జాగ్రత్తలు పాటించండి
సంక్రాంతి పండుగకు ఊరెళ్లేవారికి పోలీసులు పలు సూ చలు చేస్తున్నారు. తాళం వేసి న ఇండ్లే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉన్నందున.. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అల్వాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ సూచించారు.
అల్వాల్, జనవరి 11: సంక్రాంతి పండుగకు ఊరెళ్లేవారికి పోలీసులు పలు సూ చలు చేస్తున్నారు. తాళం వేసి న ఇండ్లే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉన్నందున.. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అల్వాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ సూచించారు.
ఊరెళ్తున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చే యకండి. దీని వల్ల ఈ సమాచారం దొంగలకు చేరి.. వారు మీ ఇల్లు గుళ్ల చేసే అవకాశం ఉంది.
బంగారు, వెండి ఆభరణాలను బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకోండి.
సెంట్రల్ లాక్ సిస్టమ్ గల తాళాన్ని అమర్చుకోండి.
వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వండి.
ఉండేవారు మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకుగానీ, డయల్ 100కు సమాచారం ఇవ్వాలి.
పకడ్బందీగా లాక్ వేయడంతోపాటు చక్రాలకు చైన్స్‌తో లాక్ వేయడం ఉత్తమం.
ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను మీ మొబైల్లో చెక్ చేసుకుంటూ ఉండండి..
ఇంటి ముందు న్యూస్‌పేపర్స్, పాలప్యాకెట్లు జమ కాకుండా చూసుకోండి. దీని ద్వారా ఇంట్లో ఎవరూ లేరని గ్రహించి దొంగలు చోరీకి పాల్పడే అవకాశం ఉంది.
సెక్యూరిటీ గార్డ్సును మాత్రమే వాచ్మన్లుగా నియమించుకోండి
లైట్లు వేసి ఉంచండి. మెయిన్ డోర్‌కు తాళ కనిపించకుండా కర్టెన్స్‌తో కప్పి ఉంచండి
ప్రజల జాగ్రత్తతోనే దొంగలకు కళ్లెం ..
పండుగల సమయంలో దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉంది. వారిని కట్టడి చేయాలంటే ప్రజల జాగ్రత్త ఎంతో ముఖ్యం. చోరీలు జరిగిన తర్వాత బాధపడటం కంటే ముందే జాగ్రత్తగా ఉంటే మేలు. అందుకే ఊరెళ్లే ముందు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్లండి. దాని వల్ల రాత్రివేళ ఆయా ప్రాంతాల్లో గస్తీ పెంచుతాం. అలాగే నమ్మకస్తులైన ఇరుగుపొరుగు వారికి కూడా మీ ఇంటిపై ఓ కన్నేసి ఉం చమని చెప్పండి. ఇంట్లో విలువైన వస్తువులు ఉంచకండి.. బంగారం, వెండి వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోండి.. – గంగాధర్, సీఐ, అల్వాల్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

