హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్ (Abdullapurmet) ఇనాంగూడలో దొంగలు బీభత్సం (Robbery) సృష్టించారు. శనివారం అర్ధరాత్రి మూడు రియల్ ఎస్టేట్ ఆఫీస్లలో చోరీకి పాల్పడ్డారు. కార్యాలయాల తాళాలు పగులగొట్టి అందులోకి ప్రవేశించారు. ఆఫీసులో ఉన్న వస్తువులను చిందర వందరగా పడేశారు. పార్క్ చేసి ఉన్న ఇన్నోవా కారుతోపాటు కంప్యూటర్లు, ప్రింటర్లు, కార్యాలయ ఫర్నీచర్ మొత్తాన్ని ధ్వంసం చేశారు.
ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. మరో ఇంట్లో ఉన్న కారును వేసుకుని స్థానికంగా దర్జాగా తిరిగారు. ఈ చోరీల్లో సుమారు రూ.30 వేల నగదుని దొంగలు అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దొంగల కోసం గాలింపు చేపట్టారు.