తాము మరణిస్తూ.. మరికొందరికి అవయవ దానం
తాము మరణిస్తూ పలువురికి అవయవదానం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పరిధిలోని వంగపల్లికి చెందిన జోగు చంద్రయ్య (48) రోజు కూలీ. తండ్రి జోగు బాలలింగం, భార్య పూలమ్మ, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు.
ఖైరతాబాద్, డిసెంబర్ 26 : తాము మరణిస్తూ పలువురికి అవయవదానం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పరిధిలోని వంగపల్లికి చెందిన జోగు చంద్రయ్య (48) రోజు కూలీ. తండ్రి జోగు బాలలింగం, భార్య పూలమ్మ, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. ఈ నెల 23న చంద్రయ్య బైక్ పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చంద్రయ్యను సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానకు తరలించారు. చికిత్స అందిస్తున్న వైద్యులు ఈ నెల 25న బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. కుటుంబ సభ్యులను జీవన్‌దాన్ ప్రతినిధులు కలిసి అవయవదానం విశిష్టతను వివరించగా వారు అంగీకరించారు. చంద్రయ్య శరీరం నుంచి కాలేయం, రెండు మూత్రపిండాలు, కండ్లను సేకరించారు.
ఆరుగురికి అవయవదానం..
మహబూబ్‌నగర్ జిల్లా బూత్పూర్ కరవేనాకు చెందిన గంగుల లక్ష్మారెడ్డి, నాగమణి దంపతుల కుమారుడు హన్మంత్ రెడ్డి (24) ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 22న తాను బైక్ పై వెళ్తూ అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికి త్స కోసం ఎల్బీనగర్లోని కామినేని దవాఖానలో చేర్పించారు. చికిత్స అందిస్తున్న వైద్యులు 24న బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. జీవన్‌దాన్ ప్రతినిధుల కౌన్సిలింగ్‌తో అవయవదానానికి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. కాలేయం, రెండు మూత్రపిండాలు, కండ్లతో పాటు ఓ ఊపిరితిత్తిని సేకరించారు. అత్యవసర రోగులకు అవయవాలను అందజేస్తామని వైద్యులు తెలిపారు. అవయవ దానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులను జీవన్‌దాన్ అభినందించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

