మచ్చబొల్లారం డివిజన్లోని హైటెన్షన్ రోడ్డును బాగు చేయాలంటూ.. నార్త్ అల్వాల్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం అల్వాల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి.. ప్రజావాణిలో ఏఎంసీకి వినతిపత్రం అందజేశారు. నార్త్ అల్వాల్లో సుమారు 20 కాలనీల ప్రజలు నివాసముంటున్నారు. ఆరు నెలలుగా అత్యంత దారుణ స్థితిలో ఉన్న హైటెన్షన్ రోడ్డు విషయమై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో 2025 అక్టోబర్లో రహదారి పనులకు అనుమతి లభించింది. అయితే ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు రోడ్డు పనులు ప్రారంభించి.. ఇరుకైన చోట్ల రహదారి వెడల్పు చేసి నిత్యం ప్రమాదాలు నివారించేందుకు డివైడర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
– అల్వాల్, ఫిబ్రవరి 2