ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి
కొండాపూర్, జనవరి 30 : యువత మహాత్మాగాంధీ ఆశయ సాధనకు, ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగాలని చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి అన్నారు. ఆదివారం గాంధీ వర్ధంతిని సందర్భంగా చందానగర్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, నాయకులు లక్ష్మీనారాయణగౌడ్, జనార్దన్‌రెడ్డి, ధనలక్ష్మి, రవీందర్‌రెడ్డి, మల్లేశ్, వెంకటేశ్, అమ్జద్‌పాషా, వరలక్ష్మి, పార్వతి, కొండల్ తదితరులు పాల్గొన్నారు.
మాదాపూర్‌లో…
మాదాపూర్, జనవరి 30: మాదాపూర్‌లోని స్వాతి హైస్కూల్ ప్రాంగణంలో ఆదివారం గాంధీ వర్ధంతితోపాటు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఫణికుమార్, సభ్యులు విష్ణుప్రసాద్, పాలం శ్రీను, ప్రవీణ్, బాలాజీ, హేమలత, రవి, భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మియాపూర్‌లో…
మియాపూర్, జనవరి 30 : శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా గాంధీ వర్ధంతిని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నేతలు, విద్యార్థులు, చిన్నారులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హరివిల్లులో చిన్నారులు గాంధీ విగ్రహాన్ని స్వయంగా శుభ్రం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.